షాద్ నగర్ లో జరిగిన… పశు వైద్యురాలు, దిశ హత్య కేసు ఘటనపై పార్లమెంట్ లో సుదీర్గంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ఎంపీలు అందరూ కూడా… నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. జీరో అవర్ లో చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీలు తెలంగాణా ప్రభుత్వంపై కూడా విమర్శలు చేసారు.
హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి : హైదరాబాద్ ఘటన చాలా గంభీర మై౦ది. పోలీసులు ఇలాంటి కేసుల్లో మరింత చురుకుగా పని చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ గా ఉంది. మహిళల భద్రతపై చిత్తశుద్దితో పని చేస్తా౦.
బిజెపి ఎంపీ బండి సంజయ్: ప్రజలను చైతన్యం చేయడం లో తెలంగాణా ప్రభుత్వం విఫలం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చెయ్యాలి, సభ్య సమాజం తల దించుకునే ఘటన… చట్టంలో మార్పులు వస్తే తప్పా ఇలాంటివి జరగవు.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి: దేశం మొత్తం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి నిందితులను కథనంగా శిక్షించాలి… పోలీసుల వైఫల్యం స్పష్టంగా ఉంది.
తెరాస ఎంపీ మాలోత్ కవిత: మహిళలపై దాడులు చేస్తే ఉరి తియ్యాలి కఠిన చట్టాలు తీసుకు రావాలి. ఈ ఘటన తీవ్రంగా కలచి వేసింది.
వైసీపీ ఎంపీ వంగా గీత: మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది… మహిళలు బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా వస్తారో..రారో తెలియని పరిస్థితి నెలకొంది, దిశను అత్యంత క్రూరంగా చంపేశారు… అమానుష ఘటనను రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఖండించాలి ఇలాంటివి చెయ్యాల౦టే భయపడేలా చట్టాలు తేవాలి.
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి: హైదరాబాద్‌లో జరిగిన అత్యాచార ఘటన చెడు వాతావరణాన్ని సృష్టించింది… నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేస్తే తప్ప న్యాయం జరగదు. ప్రజలు స్వచ్చందంగా రోడ్ల మీదకు వచ్చారు… ప్రజలను చైతన్య పరచడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటివి జరుగుతాయి.
తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు: దిశ హత్యాచార ఘటనను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారు. మహిళలకు రక్షణ కరైవన పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకర౦.
రాజ్యసభలో:
తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్: ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కనపడుతుంది… పరిధితో సంబంధం లేకుండా కేసులు నమోదు చెయ్యాలి…
కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామి రెడ్డి: నిందితులకు 15, 20 రోజుల్లో శిక్ష పడేలా చెయ్యాలి, ఇలాంటివి చెయ్యాలి అంటేనే భయపడాలి.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు: నేరస్తులు పైకోర్ట్ లకు వెళ్లి శిక్షలు తప్పించుకుంటున్నారు. చట్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని కేవలం చట్టాలు చేస్తే న్యాయం జరగదు.