ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మ‌రో వ‌రం..

-

ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపిస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే . ప్రగతి భవన్ లో కార్మికులతో ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్..కార్మికులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ముఖాముఖి నిర్వహించారు. 52 రోజుల సమ్మె కాలం జీతాన్న కూడా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం రోజునే సమ్మె కాలం జీతం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళ ఉద్యోగులు కోరిన విదంగా ప్రసూతి సెలవులు మంజూరు చేశారు.

ఆర్టీసీ కార్మికులకు రిటైర్మంట్ వయో పరిమితి 60 సంవత్సరాలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఇలా మొత్తం 26 రకాల వరాలు ప్రకటించిన సీఎం.. తాజాగా, కార్మికుల పిల్లలకు ఉచితంగా విద్య అందించే వరం ప్రకటించారు. ఈ మేరకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల పిల్లలకు ఉన్నత విద్య కోసం ఫీజులు చెల్లిస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news