అంతరిక్ష ప్రయాణం.. మొదటిసారిగా తెలుగు మహిళ.

-

అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మరికొద్ది రోజుల్లో అంతరిక్ష ప్రయాణాన్ని ప్రయోగించనుంది. జులై 11వ తేదీన నలుగు వ్యోమగాములతో అంతరిక్షయానం మొదలు కానుంది. ఆ నలుగురిలో ఒకరు తెలుగమ్మాయి ఉండడం విశేషం. అవును, అమెరికాలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెంచిన బండ్ల శిరీష, అంతరిక్ష యానం చేయనుంది. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో ప్రభుత్వ వ్యవహారాల శాఖల్ పనిచేస్తున్న శిరిషకి ఈ అవకాశం వచ్చింది.

ఈ మేరకు జూన్ 25వ తేదీన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అంతరిక్ష యానానికి ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుత ప్రయాణంతో కలుపుకుంటే ఇప్పటివరకు నాలుగు సార్లు అంతరిక్ష యానం చేసినట్టు అవుతుంది. ఐతే ఇప్పటివరకు మానవులను అంతరిక్షంలోకి పంపలేదు. నలుగురు కలిసి వెళ్ళడం ఇదే మొదటిసారి. ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయాణంలో తెలుగు అమ్మాయి ఉండడం నిజంగా గర్వకారణమే.

Read more RELATED
Recommended to you

Latest news