సెప్టెంబర్ తర్వాత పది పరిక్షలు…?

-

ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యార్ధుల భవిష్యత్తు అనేది ఆందోళనకరంగా మారింది. వారి భవిష్యత్తు ఏంటీ అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లాక్ డౌన్ ని అమలు చేయడం, కేసులు ఇంకా పెరగడం తో అసలు ఎప్పటి నుంచి పరిక్షలు జరిగే అవకాశం ఉందనేది అర్ధం కావడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విద్యార్ధులకు జగన్ సర్కార్ ఏ విషయం చెప్పడం లేదు. లాక్ డౌన్ ని తెలంగాణా లో కఠినం గా అమలు చేస్తున్నారు. ఏపీలో మాత్రం లాక్ డౌన్ విషయంలో సడలింపులు కేంద్రం సూచన ఆధారంగా ఉంటాయి. మరి పరీక్షలను నిర్వహించవచ్చు కదా అని కొందరు సూచిస్తున్నారు. ఏపీ సర్కార్ ఎలాగూ ఎన్నికలను నిర్వహిస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని పరిక్షలు కూడా నిర్వహిస్తే మంచిది అంటున్నారు.

విద్యార్ధుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సర్కార్ నిర్ణయం తీసుకోవాలి అని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు పరిక్షలు నిర్వహిస్తే కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విధంగా కూడా పరిక్షల ఆలోచన వద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే వచ్చే మూడు నెలల్లో పరిక్షలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు. సెప్టెంబర్ తర్వాతే పరిక్షలు ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news