రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. ఎందుకంటే?

రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచే కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. ఎరువుల కర్మాగారం వద్దకు వెళ్లి చర్చలో పాల్గొంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోపాటు అతడి అనుచరులు స్పష్టం చేశారు. ఇన్‌చార్జ్ సీపీ సత్యనారాయణ.. ఎమ్మెల్యే చందర్‌తో చర్చించి ఆర్ఎఫ్ సీఎల్ గేటు వద్దకు వెళ్లవద్దని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

రామగుండం-ఉద్రిక్తత
రామగుండం-ఉద్రిక్తత

దీంతో పోలీసులు ఎమ్మెల్యే చందర్‌ను, అతని అనుచరులను క్యాంపు ఆఫీసు నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో తెరాస నేతలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తమను ఎరువుల కర్మాగారం వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.