విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి బొత్స చురకలు

-

ఏపీలో తరగతుల విలీనంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఇంటి పక్కనే స్కూల్ ఉండాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు మంత్రి బొత్స. ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే పేరెంట్స్ తమ పిల్లల్ని రోజూ బడిలో దింపి, తీసుకువస్తున్నారు కదా అని మంత్రి బొత్స అన్నారు. అంతేకాకుండా.. మొదటగా మూడు కిలో మీటర్లు విలీనం చేయాలనుకున్నప్పటికీ.. ఆ తర్వాత కిలోమీటర్ కు తగ్గించామని వెల్లడించారు మంత్రి బొత్స. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలే వారి అభిప్రాయం చెబుతారని, చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం తీసుకోలేం కదా అని మాట్లాడారు మంత్రి బొత్స. విద్యార్థుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామన్న మంత్రి బొత్స .. తరగతుల విలీనంలో సమస్యలు వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స. పాఠశాలలు విలీనం, మ్యాపింగ్ కారణంగా గవర్నమెంట్ స్కూళ్లల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయని అందరూ అనుకుంటున్నారని, కానీ అందులో వాస్తవం లేదని చెప్పారు మంత్రి బొత్స.

Botsa Satyanarayana likely to have sway in N. Andhra

బడుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ ఆగస్టు 15కు పూర్తవుతుందని వివరించారు మంత్రి బొత్స. ప్రభుత్వ బడుల్లో పరిస్థితులు మెరుగుపరిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు మంత్రి బొత్స. గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాలనే తపన, ప్రేరణ కల్పించి వారంతట వారే పాఠశాలకు వచ్చేలా చేయాలన్నారు మంత్రి బొత్స. విద్యార్థులు తమకు నచ్చిన చోట పని చేసేందుకు వెసులుబాటు కల్పించాలన్నారు మంత్రి బొత్స. కరోనా సమయంలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం భారీగానే నమోదైందన్నారు మంత్రి బొత్స. ప్రైవేటు స్కూల్స్ లో చదివే లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అయ్యారని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలు ఇవ్వడంతో పాటు వివరణ కూడా ఇస్తామన్నారు మంత్రి బొత్స.

 

Read more RELATED
Recommended to you

Latest news