ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హైడ్రా అక్రమ కట్టడాలు, చెరువులను కబ్జా చేసిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ నది పరిసర ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్న విషయం విధితమే. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడి చేసుకున్నాయి. కొంత మంది కాంగ్రెస్ వెంట పడి మరీ తరిమారు బీఆర్ఎస్ నేతలు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.