తెలంగాణలోని ఆలయాల్లో మొన్నటివరకు సంచరించిన మహిళా అఘోరీ ప్రస్తుతం ఏపీలోని ఆలయాలను చుట్టేస్తున్నారు. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం అనంతరం మహిళా అఘోరీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఈ అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిత్యం ఏదో ఒక ఆలయాన్ని దర్శిస్తునన ఆమె.. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో పోలీసులు అఘోరీపై రాష్ట్రంలో నిషేధం విధించి మహారాష్ట్రకు తరలించారు.
ప్రస్తుతం ఏపీలోని ఆలయాలను సందర్శిస్తున్న అఘోరీ.. శ్రీకాళహస్తిలో ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యారు. తనను ఆలయం లోపలికి వెళ్లడానికి అనుమతించకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ప్రయత్నించింది. వెంటనే అక్కడి స్థానిక మహిళలు, అధికారులు అమెను అడ్డుకున్నాను. స్థానిక మహిళలు అఘోరీపై బిందెలతో నీళ్లు పోశారు. అఘోరీ ఆత్మాహత్యా ప్రయత్నం చేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.