బిగ్ బ్రేకింగ్ : మరో టెన్త్ పేపర్ లీక్….

-

తెలంగాణ రాష్ట్రానికి ప్రశ్నపత్రాల లీక్ బెడదగా మారింది. ఈ మధ్యన TSPSC గ్రూప్ 1 పేపర్ లీక్ అవ్వడంతో మొదలైన ఈ సమస్య… నేటికీ కొనసాగుతోంది. నిన్నటి నుండి తెలంగాణాలో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పరీక్ష మొదలైన సమయానికి వికారాబాద్ జిల్లా తాండూరు లో ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూప్ లో రిలీజ్ అయింది. దీనితో ఒక్కసారిగా విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఐతే పేపర్ లీక్ చేసిన వారిని నిన్ననే సస్పెండ్ చేసింది తెలంగాణ విద్యాశాఖ.

 

 

కాగా నేడు జరుగుతున్న హిందీ ప్రశ్నాపత్రం సైతం వరంగల్ జిల్లాలో లీక్ అయిందన్న వార్త అందరినీ షాక్ కు గురిచేస్తోంది. పరీక్ష సమయానికి నిన్నటిలాగే వాట్సాప్ గ్రూప్ లో హిందీ పేపర్ కనిపించిందట. కాగా దీనిపై అధికారులు ఏమి జరిగి ఉంటుందని విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news