పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులోని మరో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది వరంగల్ కోర్టు. బండి సంజయ్ కస్టడీ పిటిషన్ ని డిస్మిస్ చేశారు న్యాయ మూర్తి. ఈ నేపథ్యంలో సాయంత్రం లోపు నింధితులు విడుదలైయ్యే ఛాన్స్ ఉంది. కజిపేట్ రైల్వే కోర్టు లో రెండు రోజులపాటు ఈ కేసుపై వాదనలు జరిగాయి. నిందితులు బయటకు వస్తే సాక్షాలు ప్రభావితం అవుతారని బెయిల్ ఇవ్వద్దంటూ వాదించారు పి.పి.
ఏ – 1 బెయిల్ లో బయట ఉన్నప్పుడు A2. A3 .A5.. ఎలా ప్రభావితం చేస్తారని ప్రశ్నించారు బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు. 10 వ తరగతి పరీక్షలు నేటి తో ముగిసిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని బీజేపీ లీగల్ సెల్ చేసిన వాదనకు ఏకీభవించిన మేజిస్ట్రేట్.. కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. 20 వేల పూచీకత్తు, అనుమతి లేకుండా దేశం విడిపోవద్దనే కండిషన్ తో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో సాయంత్రం లోపు కరీంనగర్ జైల్ నుండి విడుదల కానున్నారు నిందితులు ప్రశాంత్, మహేష్, శివ, గణేష్ లు.