మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా..? ఆ బిజినెస్ లో మంచిగా లాభాలను సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఈ బిజినెస్ ఐడియా. దీనిని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మంచి రాబడి వస్తుంది. పైగా దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దీనితో కేవలం మీ ఇంట్లో మిద్దె మీద కూరగాయల ముక్కలు వేసి చక్కగా లాభాలని పొందొచ్చు.
ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ మధ్య కాలంలో చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెనింగ్ విధానంలో సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పువ్వులు సాగుచేసి అమ్మితే మంచిగా డబ్బులు వస్తాయి. కెమికల్స్ వెయ్యకుండా ఇలా సాగు చేసిన వాటికి డిమాండ్ కూడా ఎక్కువ.
టెర్రస్ గార్డెనింగ్ చేసి ఒక వ్యక్తి సుమారు 90 మొక్కలను కొనుగోలు చేశారు. మొక్కలు నాటడం ఎలా అనేది తెలుసుకుని కుండీలుని కొని ఎర్ర మట్టి, నల్ల మట్టి, సేంద్రియ ఎరువులు వేసి వాటిలో మొక్కల్ని పెంచడం మొదలు పెట్టారు. అయితే ఇలా వివిధ రకాల మొక్కలను కొనుగోలు చేసి వాటిని పెంచడానికి 12 వేల రూపాయలు ఖర్చయింది. వాటిని అమ్మితే 85 వేల రూపాయలు వచ్చాయి. ఇలా టెర్రస్ గార్డెన్ తో అద్భుతంగా సంపాదించ వచ్చు కాబట్టి ఈ ఐడియా ని అనుసరించి మీరు కూడా మంచిగా లాభాల్ని పొందండి.