దేశం పై ఉగ్రవాదులు పంజా విసురుదామని వేచి చూస్తున్నారు. భారత్ కరోనాతో సతమతమవుతుంటే ఇదే సమయాన్ని వారు అదునుగా చేసుకొని దాడులకి పాల్పడుతున్నారు. నేడు ఉదయం ఉగ్రవాదులు దాడి చేసిన తీరు నాడు జరిగిన పుల్వామా ఘటనను గుర్తు చేస్తుంది. అచ్చం పుల్వామా ను తలపించే దాడికి యత్నించారు తీవ్రవాదులు. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా లో మరోసారి ఉగ్రవాదులు దాడి చేశారు. పుల్వామా లోని గంగూ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కాన్వాయ్‌పై దాడికి దిగారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈఐడీని పేల్చారు. ఈ ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఉగ్రవాదులు ఈ దాడికి యత్నించగానే అప్రమత్తమైన జవాన్లు వారిపై కాల్పులు జరిపారు. అనంతరం తప్పించుకున వారిపై వేటలో పడ్డారు మన జవాన్లు.