తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రం మొత్తంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. అయితే కేంద్ర పురావస్తుశాఖ తాజా నిర్ణయం ప్రకారం హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక కట్టడాలైన గోల్కొండ కోట, చార్మినార్ సందర్శనను కూడా పర్యాటకుల కోసం పునరుద్ధరిస్తన్నారు.
ఈ మేరకు సోమవారం (జులై 6) నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. దీనికోసం రాష్ట్రంలో భారత పురావస్తు సర్వే ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు గోల్కొండ కోటను తెరిచి ఉంచనున్నారు. సందర్శకులు ఏఎస్ఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలి. ఎంట్రన్స్ ల వద్ద కౌంటర్లలో టికెట్లు అందించరు. చార్మినార్, గోల్కొండ కోట సందర్శనకు రోజూ ఆన్ లైన్‌లో గరిష్ఠంగా 2 వేల మందికే టికెట్లను జారీ చేస్తారు.