పెళ్లికాని అమ్మాయిలు ఫోన్ వాడొద్దంటూ వింత తీర్మానం

-

పెళ్లికాని అమ్మాయిలు ఫోన్​ వాడటానికి అనుమతి ఇవ్వంద్దంటూ ఓ వింత నిబంధన పెట్టారు గుజరాత్​లోని ఠాకోర్​ సమాజ్​ సభ్యులు. బనాస్​కాంఠ జిల్లాలోని భాభార్ తాలూకాలోని లున్‌సేలాలో జరిగిన సంత్‌ శ్రీ సదరమ్ బాపా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మొత్తం 11 ఈ సంస్కరణలు రూపొందించారు. తమ కమ్యూనిటీ ప్రజలు ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ 11 నియమాలను అందరూ పాటించాలని శపథం చేశారు.

ఇంతకీ ఆ 11 నియమాలేంటంటే..?

  1. వివాహాలలో డీజేలపై పూర్తి నిషేధం.
  2. పెళ్లిలో బహుమతులకు బదులుగా నగదు ఇచ్చుకోవాలి.
  3. పెళ్లికి వరుడు, వధువు రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులను మాత్రమే బహుమతిగా ఇవ్వాలి.
  4. నిశ్చితార్థానికి 11 మంది అతిథులు మాత్రమే హాజరు అవ్వాలి.
  5. వివాహా కార్యక్రమానికి 51 మంది అతిథులు మాత్రమే హాజరు కావాలి.
  6. సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీ వివాహాలు నిర్వహించాలి.
  7. నూతన వధూవరులు.. బంధువుల ఇంటిని సందర్శించినప్పుడు వారికి డబ్బును ఇవ్వకూడదు.
  8. నిశ్చితార్థం, వివాహాన్ని రద్దు చేసినందుకు శిక్షలు విధించకూడదు.
  9. పెళ్లికాని అమ్మాయిలకు మొబైల్ ఫోన్​ను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వకూడదు.
  10. మత్తు పదార్థాలకు బానిసలైన వారి కోసం డీ-అడిక్షన్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
  11. ప్రతి గ్రామంలోని ప్రజలు చదువుకోవడానికి వెళ్లే బాలికలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news