దేశంలోని 110 కంపెనీల పీపీఈ కిట్స్ తయారీదారులు రోజుకు 5 లక్షలకు పైగా ఉత్పత్తి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు. “ఇప్పుడు మనకు భారతదేశంలో 110 పిపిఈ తయారీదారులు ఉన్నారు, రోజుకు 5 లక్షలకు పైగా ఉత్పత్తి చేస్తున్నారని ఆయన వివరించారు. తగినంత సంఖ్యలో పిపిఈలు రాకపోవడంపై ఫిర్యాదు చేసే రాష్ట్రాలు, ఇప్పుడు పిపిఈలను స్వేచ్చగా తీసుకుంటున్నాయి అని అన్నారు.
ఇప్పుడు వారి నోటి నుంచి మాట రావడం లేదని ఆయన అన్నారు. ” 79 వ ఫౌండేషన్ డే ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) లో హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. కోవిడ్ -19 కోసం భారత్ సుమారు 7 కోట్ల పరీక్షలు నిర్వహించిందని , రికవరీ రేటు మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు .