వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి కి వైఎస్ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధం ఉంది. వైయస్ కుటుంబానికి చెందిన మూడు తరాల తో తన బంధం ఉందని కూడా విజయసాయిరెడ్డి చాలా సార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ జగన్ కి రాజకీయాల్లోకి రాకముందు నుండే వ్యాపారం చేస్తున్న టైమ్ లో సలహాలు సూచనలు ఇస్తూ అండగా విజయసాయిరెడ్డి నిలుస్తున్నారు. రాజకీయాల్లోకి జగన్ వచ్చిన తర్వాత వైయస్ చనిపోయిన తర్వాత జగన్ జీవితంలో కీలకంగా మరియు కుడిభుజంగా మారారు విజయసాయిరెడ్డి. అటువంటిది ప్రస్తుతం విజయసాయిరెడ్డి కంటే జగన్ కి కుడిభుజంగా మంత్రి పేర్ని నాని మారారు అని వైసీపీ పార్టీలో టాక్.రాష్ట్రంలో కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయతాండవం కి బాగా పోరాడుతున్న నాయకుడిగా వైసీపీ పార్టీలో మంత్రి పేర్ని నాని పేరు వినబడుతోంది. మామూలుగా అయితే ఇలాంటి విపత్కర సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేరు వినపడాలి. కానీ ఫస్ట్ నుండి ఆళ్ల నాని ఈ విషయంలో చాలా సైలెంట్ గా ఉంటున్నారు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు మరియు ముఖ్యమంత్రి సూచనలు మీడియాకు అందిస్తున్నారు. కానీ పేర్ని నాని మాత్రం కరోనా వైరస్ విషయంలో ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పి కొడుతూ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దాని విషయంలో మీడియా కి చాలా బ్రీఫ్ గా చెబుతున్నారు.
మంచి వాగ్దాటి ఉండటంతో కరోనా వైరస్ విషయంలో ప్రతిపక్షాలతో చెడుగుడు ఆట ఆడుకుంటున్నారు. అంతేకాకుండా పోలీసులతో, వైద్యులతో కలిసిపోయి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మచిలీపట్నంలో పాజిటివ్ కేసు నమోదయిన టైములో ప్రతి ఇంటికీ గ్రామ వాలంటీర్ల తో పాటు తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పారు. దేశమంతటా పోరాడుతున్న కరోనా వైరస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అరికట్టడానికి అందరి కంటే పేర్ని నాని బాగా పనిచేస్తున్నారని చాలామంది అంటున్నారు. మొత్తం మీద మొట్టమొదటి సారి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కి అత్యంత క్లిష్టమైన సమయంలో విజయసాయి రెడ్డి కంటే అతి పెద్ద అండగా కుడిభుజంగా మంత్రి పేర్ని నాని వ్యవహరిస్తున్నారు అని రాజకీయాలలో టాక్.