ఆ ఆరేళ్ల పాప శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోతుందట.. అరుదైన వ్యాధి

-

ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు.. అలాగే రకరకాల రోగాలు ఉన్నాయి.. ఏ రోగం ఉన్నా..ఏ అవయవం పాడేనా.. ఊపిరి ఉన్నంత వరకూ..శ్వాస తీసుకోవడం మాత్రం జరుగుతుంది. కానీ ఆ పాపకు ఉన్న రోగమే.. శ్వాస తీసుకోవడం మర్చిపోవడం.. అసలు మనకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుంది.. కానీ ఆ ఆరేళ్ల పాపకు మాత్రం శ్వాస తీసుకోవడమే గుర్తుండదట.. నిద్రపోతూ శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది. అలా ఆమె మరణం బారిన పడే అవకాశం ఉంది. శ్వాస తీసుకోవడం మర్చిపోయి, మరణం అంచుల వరకు వెళ్లి ఎన్నోసార్లు వచ్చింది. ఇది ఒక విచిత్రమైన వ్యాధి.

 

ప్రపంచవ్యాప్తంగా కేవలం 1000 మంది లోపే ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు ఉన్నారు. ఇది ఒక అస్పష్టమైన నాడీ సంబంధిత వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. పుట్టుకతోనే ఈ రోగం వస్తుంది. ఆంగ్లంలో దీన్ని ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. బ్రిటన్‌లోని ఆరేళ్ల పాప సాడీ ఇలా శ్వాస తీసుకోవడం మర్చిపోయే రోగంతో బాధపడుతోంది.

సాడీ తల్లి మాట్లాడుతూ రోజు రాత్రి తాము తమ పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటామని.. ఆమె మెదడు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతుందని, అందుకే రాత్రి పడుకునే ముందు లైఫ్ సపోర్ట్ సిస్టం పెట్టి నిద్రపుచ్చుతామని వివరిస్తోంది. లేకుంటే ఏ క్షణమైనా సాడీ శ్వాస ఆగిపోవచ్చని చెబుతోంది.
సాడీకి శ్వాస ఆగిపోయిన క్షణంలో శరీరం నీలం రంగులోకి మారుతుందట.. పుట్టుకతోనే సాడికీ ఈ సమస్య వచ్చిందని, కానీ పుట్టినప్పుడు అందరి పిల్లలాగే జన్మించిందని తెలిపింది.

పాపకి రెండు నెలల వయసు ఉన్నప్పుడే శ్వాస తీసుకోవడానికి ఆమె మెడలో ఒక చిన్న ‘ట్రాకియోటమీ’ని పెట్టారు. దాని వల్లే సాడీ ఊపిరి పీల్చుకోగలుగుతుంది. అది లేకుండా పాప స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. మెడలోని ఫ్రెనిక్ నరాలలో పేసర్ ఇంప్లాంట్ చేయాలి. ఇందుకోసం చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఆ సర్జరీ కావలసిన డబ్బు కోసం.. ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది.

సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటే ఏంటి..

సెంట్రల్ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ పుట్టుకతోనే వస్తుంది. నాడీ వ్యవస్థను, శ్వాసక్రియను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు. నిద్రిస్తున్నప్పుడు శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గి, కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. ఇది మరణానికి కూడా దారితీస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news