వేసవిలో వీటిని తీసుకుంటే.. వడదెబ్బ కొట్టదు…!

-

వేసవిలో రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వేసవిలో ఎండ వలన విపరీతమైన దాహం కలుగుతూ ఉంటుంది. దానితో పాటుగా నీరసం, వడదెబ్బ వంటివి కూడా వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వేసవికాలంలో తరచూ ఈ లిక్విడ్స్ ని తీసుకుంటూ ఉంటే మంచిది. అప్పుడు దాహం తీరుతుంది హైడ్రేట్ గా ఉండొచ్చు. వేసవికాలంలో లిక్విడ్స్ ఎంత తీసుకుంటే అంత మంచి సమస్యలు ఉండకుండా ఉంటాయి.

 

నన్నారిని తీసుకుంటే దాహం తీరుతుంది. వడదెబ్బ తగలదు నన్నారి వేర్లతో దీనిని చేస్తారు ఈ వేర్లు తీసుకుని అందులో పంచదార నీళ్లు నిమ్మరసం వేసుకోవాలి. కొంతమంది నన్నారిలో పాలు కూడా వేసుకుంటారు అలా కూడా మీరు తీసుకోవచ్చు. దీనిలో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.


పానకం కూడా మీరు వేసవిలో తీసుకోవచ్చు దాహం ఉండదు. వాడబెబ్బ తగలదు. పంచదార నిమ్మరసం అల్లం పొడి మిరియాలు యాలుకలు నీళ్లలో వేసుకుని తయారు చేసుకోవచ్చు. హైడ్రేట్ గా ఉండడానికి అవుతుంది శ్రీరామనవమి నాడు పానకం ని రాముడికి నైవేద్యంగా పెడతారు అదే పానకం ని మీరు వేసవికాలంలో తయారు చేసుకుని తీసుకోవచ్చు.
లస్సీ కూడా చాలా బాగుంటుంది వేసవికాలంలో లస్సీని తీసుకుంటే చల్లగా ఉంటుంది మ్యాంగో లస్సీ వంటివి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చు.
బట్టర్ మిల్క్ ని కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఇంగువ జీలకర్ర పొడి పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఉప్పు మజ్జిగలో వేసి క్షణాల్లో తయారు చేసుకుని తీసుకోవచ్చు. హైడ్రేట్ గా ఉండడానికి అవుతుంది వడ దెబ్బ కూడా తగలదు.
ఆమ్ పన్నా కూడా బాగుంటుంది మామిడికాయల సీజన్ కాబట్టి మీరు వేసవికాలంలో క్షణాల్లో తయారుచేసి తీసుకోవచ్చు. చక్కగా రుచిగా ఉంటుంది. జీలకర్ర చింతపండు నిమ్మరసం పుదీనా బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా వేసి చేసుకోవచ్చు.
తాండాయ్ కూడా చాలా బాగుంటుంది దీనిని హోలీ నాడు తయారు చేసుకుంటూ ఉంటారు వేసవి కాలంలో తయారు చేసుకుని హైడ్రేట్ గా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news