రాజ్ కుంద్రాతో పనిచేయడం నా అతిపెద్ద పొరపాటు.. పూనమ్ పాండే.

-

పూనమ్ పాండే, రాజ్ కుంద్రా కి మధ్య వ్యాపార సంబంధ విషయాల్లో తగాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో లీగల్ ఫైట్ నడుస్తుంది. ఐతే తాజాగా పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. నా వృత్తిపరమైన జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది రాజ్ కుమ్ద్రాతో పనిచేయడమే అని పూనమ్ పాండే తెగేసి చెప్పింది. ఇటీవల అశ్లీల సినిమాల చిత్రీకరణ నేరం కింద రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యారు. జులై 23వ తేదీవరకు రిమాండ్ లోనే ఉండాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఈ విషయంలో విచారణ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా పూనమ్ పాండే ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. ఫోన్ హ్యాక్ చేయడం, మొదలగునవన్నీ నాకు జరిగాయని పూనమ్ పాండే వెల్లడి చేసింది. పాస్ వర్డ్ వివరాలు పంపించడం నాకు శాపంగా మారిందని పేర్కొంది. నా జీవితంలో రాజ్ కుంద్రాతో పనిచేయడం అతిపెద్ద పొరపాటని పూనమ్ పాండే తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version