ఆ చెత్త బ్యాగ్‌ విలువ 49.6 లక్షల రూపాయిల?

-

సాధారణంగా ఎక్కడైనా చెత్త బ్యాగ్ కు ఎంత విలువ ఉంటుంది అంటే వందో రెండు వందలో ఉంటుందని చెబుతారు. అయితే ఆ చెత్త బ్యాగ్ విలువ మాత్రం ఏకంగా 49 లక్షల రూపాయలు. చెత్త బ్యాగ్ కు అంత విలువా..? అని ఆశ్చర్యపోతున్నారా…? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఈ చెత్త బ్యాగ్ కు ఇంత విలువ ఉండటానికి ప్రత్యేకమైన కారణమే ఉంది. ఈ చెత్త బ్యాగ్ సాధారణంగా చేసిన చెత్త బ్యాగ్ కాదు.

కాంస్యంతో తయారు చేసిన చెత్త బ్యాగ్ కావడంతో ఈ చెత్త బ్యాగ్ కు అంత విలువ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చెత్త బ్యాగ్ కు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. కాంస్యంతో తయారు చేసిన చెత్త బ్యాగ్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు చెత్త బ్యాగ్ భలే ఉందే….? అని కామెంట్లు చేస్తున్నారు. బ్రిటిష్ కళకారుడు గావిన్ టర్క్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో చదివిన సమయంలో ఈ చెత్త బ్యాగ్ ను తయారు చేశారు.

కరిగించిన కాంస్యం లోహంతో తయారు చేసిన చెత్త బ్యాగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బిన్ బ్యాగ్ రూపంలో కాంస్యంతో తయారు చేసిన ఈ బ్యాగ్ కు నల్ల పెయింటింగ్ వేశారు. ఈ బిన్ బ్యాగ్ ధర తెలిసి ఇది చెత్త రూపంలో ఉన్న సంపద అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ బిన్ బ్యాగ్ యొక్క కళాకృతులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news