నందమూరి హీరో గా హరికృష్ణ వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన చాలా ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వాటిలో హిట్ సినిమాలు కంటే ఫెయిల్ అయిన సినిమాలే ఎక్కువగా ఉండడం గమనార్హం.. ముఖ్యంగా మంచి కంటెంట్ తో వచ్చినప్పటికీ ఆయన సినిమాలు చాలావరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే తన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అనే ప్రశ్నకు తాజాగా కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాజాగా కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించగా.. అందులో ఎన్నో విషయాలను పంచుకున్నారు.. బింబిసార కంటే ముందే ఓకే చెప్పిన ప్రాజెక్ట్లలోఇప్పుడు నటిస్తున్నాను. నేను ఫిక్స్ చేసిన అమిగోస్ టైటిల్ కరెక్ట్ అని కామెంట్ లు చేశారు. సినిమా రంగంలో ఫ్లాప్ల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. కరోనా సమయంలో నేను చేసిన సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణం ఏమిటి అంటే సినిమాలను ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలియకపోవడమే నాకు మైనస్ అయింది. వరుసగా సినిమాలు చేయడమే నాకు తెలుసు.. అందుకే నా కెరియర్ ఫెయిల్ అయింది అంటూ ఆయన చెప్పుకు వచ్చారు.
ఇకపోతే డెవిల్ మూవీ ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి అయిందని.. సినిమా చూస్తే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించాడనే భావన కలగదు అని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేస్తారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు కళ్యాణ్ రామ్.