అందుకే అసంతృప్తికి గురయ్యా: జీవన్ రెడ్డి

-

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక, ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయమై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయంచినట్లు సమాచారం.దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ వెళ్లారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో చర్చలు జరిపామని మంత్రి శ్రీధర్ తెలిపారు.

ఇక ఈ చర్చల అనంతరం …. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. పార్టీ నియమ నిబంధనలు పాటిస్తానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకోనందుకే అసంతృప్తికి గురైనట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్లు జీవన్ రెడ్డి తెలిపారు.కాగా, 2014 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు జీవన్ రెడ్డి,సంజయ్ లు జగిత్యాల పాలిటిక్స్‌లో ప్రత్యర్థులుగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news