అందుకే కదా రష్మికను నేషనల్ క్రష్ అని పిలిచేది..?

-

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక ప్రస్తుతం స్టార్ పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు.. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగానే ఉంటోంది. సినిమాలకు సెలబ్రెటీలకు సంబంధించి రేటింగ్ ఇస్తూ ఎప్పుడూ కూడా మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది ఆన్లైన్ పోర్టల్ IMBD తాజాగా ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో హీరోయిన్ రష్మిక మూడవ స్థానంలో నిలవడంతో ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో టాప్ సెలబ్రిటీల జాబితాలో ఈమె మూడో స్థానంలో రావడం జరిగింది. ఇటీవల పుష్ప -2 టీజర్ వచ్చిన సందర్భంగా ఈమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో రష్మిక పేరు బాగా వైరల్ గా మారింది. అందుకే IMBD టాప్ టెన్ జాబితాలో మోస్ట్ క్రేజీ సెలబ్రిటీగా పేరుపొందింది రష్మిక. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ నటిగా మంచి పేరు సంపాదించుకుంది . ప్రస్తుతం సౌత్లో పల సినిమాలలో నటిస్తోంది. సౌత్ లోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు పొందింది రష్మిక.

పుష్ప-2 సినిమా తర్వాత హీరో నితిన్ , వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెయిన్బో సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ చిత్రంగా తెరకెక్కిస్తున్న యానిమల్ సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయింది. ఒకవైపు వరుస సినిమా షూట్లతో మరొకవైపు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంటూ ట్రెండీ గా మారుతుంది. రష్మిక టాప్ సెలబ్రిటీల జాబితాలో మూడో స్థానం దక్కించుకోవడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news