వివేకా హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారుల బృందం వెళ్లింది. రెండు వాహనాల్లో సుమారు పది మంది సీబీఐ అధికారులు..వచ్చారు. హడావుడిగా లోనికి వెళ్లిన సీబీఐ బృందం… వైఎస్ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఇంట్లోకి ఎవరినీ అనుమతించని సీబీఐ… ఇంట్లో వాళ్లందరినీ విచారణ చేస్తోంది. ఎంపి అవినాష్, భాస్కర్ రెడ్డి పిఏ లను బయటే పెట్టిన సిబిఐ.. దర్యాప్తును కొనసాగిస్తోంది. అయితే..తాజాగా అందుతున్న సమాచారం మేరకు వివేకా కేసులో ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది సీబీఐ. అనంతరం… పులివెందుల నుంచి తమ వాహనాల్లో హైదరాబాద్ కు తీసుకెళ్లింది సీబీఐ.