అందుకే హీరోయిన్ పొజిషన్ వదిలి సహాయనటిగా మారా.. హీరోయిన్ ప్రేమ

-

భక్తిపరమైన పాత్రలకు పెట్టింది పేరు హీరోయిన్ ప్రేమ.. అచ్చం దేవతల పాత్రలో ఒదిగి పోవడం.. లీనమైపోవటం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. ఈ పాత్రలతో పాటు గ్లామర్ పాత్రలను కూడా పోషిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసింది ఈ భామ.. అయితే తాజాగా ఆలీతో జాలీగా కార్యక్రమానికి హాజరైన ప్రేమ హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు సహాయ నటిగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది..

హీరోయిన్ ప్రేమ.. తనదైన అందంతో అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది హీరోయిన్గా దాదాపు అందరూ స్టార్ హీరోల పక్కన నటించేనా ప్రేమ అప్పట్లో యువకుల కలల రాణిగా మెలిగింది.. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ధర్మచక్రం సినిమాతో ప్రేమ టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అప్పట్లో ప్రేమ నటించిన దేవి సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి.. తెలుగు తమిళ్ కన్నడ అన్ని భాషల్లో పలు చిత్రాల్లో నటించినా.. హీరోయిన్గా కొంతకాలం మాత్రమే ఒక వెలుగు వెలిగింది.. హీరోయిన్లు ఎంత వేగంగా వస్తారో.. అంత త్వరగా ఫెడ్ అవుట్ అయిపోతారు అనే జాబితాలో చేరిపోయింది ఈ భామ.. తాజాగా రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అనుకోని ప్రయాణం చిత్రంలో ఓ పాత్రలో నటించింది ప్రేమ. అయితే ఈ సినిమాలో మరో క్యారెక్టర్ లో నటించిన సీనియర్ యాక్టర్ నరసింహారాజుతో కలిసి తాజాగా ఆలీతో జాలీగా కార్యక్రమానికి హాజరైన ప్రేమ హీరోయిన్గా మంచి పాత్రలు చేస్తున్న సమయంలో చిరుగాలి చిత్రంలో సహాయనిటిగా ఎందుకు నటించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది..

“2000 సంవత్సరంలో చిరుగాలి సినిమా వచ్చేటప్పటికి నేను హీరోయిన్ గా మంచి పొజిషన్లోనే ఉన్నాను అయితే ఈ సినిమా కాన్సెప్ట్ మాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఇందులో నా పాత్ర ఎమోషనల్ గా నాకు దగ్గర అయింది.. అందుకే ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నా.. ఇందులో నా పాత్రకు ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు.. ఇందులో సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ పాట అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం సరిగ్గా వింటే ఈ పాటలో ఎంతో అర్థం కనిపిస్తుంది..” అని చెప్పుకొచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version