హైకమాండ్ నుంచి తెలంగాణ నేతలకు ఎలాంటి పిలుపు రాలేదు – ఎంపీ లక్ష్మణ్

-

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిజెపి హై కమాండ్ నుంచి పిలుపు వచ్చిందని.. దీంతో వారు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని, ప్రధాని మోదీతో భేటీ కానున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలలో నిజం లేదని కొట్టి పారేశారు బిజెపి ఎంపీ లక్ష్మణ్. హై కమాండ్ నుంచి తెలంగాణ నేతలకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో ఎలాంటి సమావేశము షెడ్యూల్ చేయలేదన్న ఆయన.. గత రెండు రోజులుగా పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తో సమావేశాలు జరిగాయని చెప్పారు. పార్టీ సంస్థగత కార్యక్రమాలు మాత్రం జరుగుతున్నాయి అన్న ఆయన.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం నిమిత్తం తెలుగు నేతలను పిలిచి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version