భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీ సర్కారు బిగ్ షాక్…ఇక రోజుకు నాలుగు షో లే

భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది. అమరావతి. సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లు సభలో ప్రవేశపెట్టారు మంత్రి పేర్ని నాని. సినిమాటోగ్రఫీ చట్టం మార్పులపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించాల్సిన సినిమా హాళ్లలో ఆరు కు పైగా షోలు వేస్తున్నారని చెప్పారు. సినీ పరిశ్రమలో ఏమి చేసినా ఎవ్వరు ఏమి అనరు అనే ఉద్దేశ్యంతో ఉన్నారని… పేద మధ్యతరగతి వారికి సినిమా వినోదమని చెప్పారు.

ప్రజల బలహీనత లు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని… ఆన్లైన్ టికెట్ విధానం వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుందన్నారు. థియేటర్ లో కూడా ఆన్లైన్ తోనే టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని.. కేవలం రోజు 4 షో లు మాత్రమే వేయాలనేది ప్రభుత్వం ఉద్దేశమని పేర్ని నాని తేల్చి చెప్పారు. ఇంటి దగ్గర్నుంచి కదలకుండా ప్రభుత్వం చెప్పిన ధరకు టికెట్ దొరికే విధంగా సినిమాటోగ్రఫీ చట్టం లో మార్పులు చేస్తున్నామని.. జిఎస్టీ ని పోల్చి చూసుకుంటే ఎక్కడ పొంతన కుదరడం లేదని వెల్లడించారు. ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ లు దాచే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని.. రాష్ట్రంలో రాజకీయ పార్టీ లు, కొన్ని మీడియా సంస్థలు ఆన్ లైన్ టికెట్ విధానం పై బురద చల్లుతున్నారని ఆగ్రహించారు.