ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పొగాకు తో పాటు, గుట్కా, తంబాకు, పాన్ మసాలా లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం నేటి నుంచే అమలు లో ఉంటుందని తెలిపింది. అలాగే ఏడాది పాటు పొగాకు ఉత్పత్తులతో పాటు పాన్ మసాలా, గుట్కా, తంబాకు నిషేధం ఉంటుందని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వలను రాష్ట్ర కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన వాటిని ఇతర పేర్ల తో సరఫరా చేసినా.. అమ్మినా.. తయారు చేసినా.. నిల్వ చేసినా.. నేరం గా నే పరిగణిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిబంధనలను అతి క్రమిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగ ఇటీవల రాష్ట్రంలో పోగాకు ఉత్పత్తులు విపరీతం గా పెరిగాయనే వార్తలు ఎక్కువ గా వస్తున్నాయి. ఈ పొగాకు ఉత్పత్తులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.