చిన్న బడ్జెట్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్ని సినిమాలు ఐదు షోలు రన్ చేసుకోవచ్చని… ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యన ఐదు షోలు వేసుకోవచ్చని పేర్కొన్న సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. అయితే చిన్న సినిమాలు విడుదలైతే.. కంపల్సరీగా ఆ సినిమాకు ఓ షో వేసుకునే వీలు కల్పించాలని రూల్ పెట్టారు. దీంతోచిన్న సినిమాలకు లబ్ది చేకూరనుంది.
సినిమా టికెట్ రేట్లను నిర్దారిస్తూ జీవో నెంబర్ 13ను గత నెలలో జారీ చేశామని.. సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడు రెమ్యునరేషన్ కాకుండా రూ. 100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు 10 రోజుల పాటు ప్రత్యేక టికెట్ నిర్దారించుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా దరఖాస్తు వచ్చిందని.. రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్టు వెల్లడించారని వెల్లడించారు.
దానికి అనుగుణంగా పరిశీలించి జీఎస్టీ చెల్లించిన తర్వాత ప్రత్యేక టిక్కెట్ రేట్లకు అనుమతి ఇస్తామని.. జీవో జారీ కంటే ముందే ఆర్ ఆర్ ఆర్ సినిమా నిర్మించారని పేర్కొన్నారు. ఈ కారణంగా 20 శాతం షూటింగ్ రాష్ట్రంలో చేసి ఉండాలన్న నిబంధన ఈ సినిమాకు వర్తించదని.. కొత్తగా నిర్మించే సినిమాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు..