తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసింది. కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై 7 రోజుల్లో మరోసారి చర్చించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. కాంగ్రెస్ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పీసీసీ పదవి కోసం ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్,మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎంపీ సురేశ్ షెట్కర్, ఎంపీ బలరాంనాయక్,ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు కూడా అధ్యక్ష పదవిని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.