మాస్క్… ప్రపంచాన్ని శాసిస్తుంది. మాస్క్ విషయంలో ప్రపంచం మొత్తం కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అలాంటిది ఒక చిన్నారి మాస్క్ తీసేస్తూ భూమి మీదకు అడుగు పెట్టిన ఫోటో వైరల్ అవుతోంది. ఏంటీ అసలు ఈ మేటర్ అంటే… దుబాయ్ కు చెందిన డాక్టర్ సమీర్ చెయిబ్ ఆసుపత్రి నుండి ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేసారు. ఈ ఫోటోలో అప్పుడే పుట్టిన శిశువు ఫేస్ మాస్క్ లాగడం ఉంటుంది.
ఆ ఫోటోలో డాక్టర్ కూడా నవ్వుతూ ఉంటారు. చిన్నారి చేతిలో మాస్క్ ఉంటుంది. అక్కడ ఉన్న వారు క్లిక్ మానిపించారు. “మేము అందరం త్వరలో ముసుగు తీయబోతున్నాం” అని సమీర్ చెయిబ్ తన పోస్ట్ లో రాసారు. ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తుంది ఈ ఫోటో. 2020 లో బెస్ట్ ఫోటో ఇదే అంటున్నారు. వేలాది మంది లైక్స్, లక్షల మంది కామెంట్స్ చేసారు.
https://www.instagram.com/p/CF9nlvZJYDT/?utm_source=ig_embed