భారీ వర్షాల ఎఫెక్ట్ : LRS గ‌డువు ఈ నెల 31 వ‌ర‌కు పెంపు

-

తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు మళ్ళీ గడువు పొడిగించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్రమంగా పుట్టుకొచ్చిన వెంచర్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసేందుకు తీసుకొచ్చిన లే ఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) చాలా మందికి ఊరట నిచ్చే అంశం అని చెప్పచ్చు.

ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ లేకపోతే..రిజిస్ర్టేషన్‌లు జరిగే అవకాశం లేకపోవడం, నిర్మాణాలకు అనుమతించకపోవడం లాంటివి ఉండేవి కానీ ఈ ఎల్ఆర్ఎస్ చాలా మందికి ఉపయుక్తం. అంటే ప్రభుత్వానికి కూడా అనుకోండి. ఇక ఇప్పటి దాకా హైదరాబాద్‌లో 2 లక్షల 58వేల మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 19.33 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో దరఖాస్తుల గడువు పొడిగించినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news