తూర్పు లడఖ్ లో భారత బలగాలను వెనక్కు తీసుకునే విషయంలో ఇప్పుడు ముందు అడుగు పడటం లేదు. ఈ మేరకు చైనాతో చర్చలు ఒక పక్క జరుగుతూనే ఉండగా చైనా మాత్రం వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది. యుద్ధం చేయడానికి చైనా సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తల నేపధ్యంలో భారత విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ స్పందించారు. “చర్చలు జరుగుతున్నాయి మరియు ఇది పురోగతిలో ఉంది” అని అన్నారు.
ఏమి జరుగుతుందో మనకు మరియు చైనీయులకు మధ్య రహస్యంగా ఉందని అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ విషయం గురించి నేను బహిరంగంగా ఏమీ చెప్పలేను అని, అంతా జాగ్రత్తగా ఉన్నామని అన్నారు. ఇక సరిహద్దు రాష్ట్రాల విషయంలో చైనా వ్యవహారశైలిపై అనుమానాలు వస్తున్నాయి. లడఖ్ మాదే అని చైనా అంటుంది.