కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 1999లో పాకిస్థాన్‌పై వీరోచితంగా పోరాటం చేసిన భారత జవాన్ల ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైనికుల శౌర్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌పై అపూర్వ విజయానికి నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. వీర జవాన్ల ధైర్య సాహసాలను గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆనాటి జవాన్ల శౌర్యం, వీరోచిత పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 1999లో మన దేశాన్ని రక్షించిన మన సాయుధ దళాల ధైర్యం, ధృడ సంకల్పం గుర్తు చేసుకోవాలి. వారి శౌర్యం, పరాక్రమం భావితరాలకు స్ఫూర్తిదాయకం. జవాన్ల ధైర్యసాహసాలకు భారత్ కృతజ్ఞతలు తెలుపుతోంది అని అన్నారు.భారత్‌లోని పేదల ప్రయోజనాల దిశగా.. కీలక నిర్ణయాలకు ముందు యోచించాలని మహాత్ముడు పిలుపునిచ్చారని వాజ్‌పేయీ నాడు గుర్తుచేశారు..ఆ నాడు వాజ్‌పేయీ చేసిన ప్రసంగం వలన సైనికులలో ఈరోజు పోరాటం చేయడానికి నాంది పలికింది అన్నారు. అందుకే ఆ దృష్టి మొత్తం దేశ రక్షణ మీద, శత్రువుని మాతృదేశంలో అడుగుపెట్టకుండా వీరోచిత పోరాటం చేసే విధంగా ఉంది అని అన్నారు.