ఎల్లుండి జగన్‌ సర్కార్‌ తో కేంద్రం కీలక సమావేశం

అమరావతి : జగన్‌ సర్కార్‌ తో కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల ఆరో తేదీన ఏపీ ప్రభుత్వం తో కీలక భేటీ నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీలక అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించ నున్నారు కేంద్ర సమన్వయ కార్యదర్శి.
ఏడు శాఖలకు చెందిన ముఖ్యమైన 13 అంశాలపై ఆయా శాఖల కేంద్ర కార్యదర్శులు… ఏపీ సీఎస్ ఆదిత్య నాధ్ దాస్, ఆయా శాఖల ఏపీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Jagan
Jagan

పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, కృష్ణ-గోదావరి రివర్ బోర్డులు గెజిట్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, పెట్రోలియం యూనివర్శిటీ, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడలో హార్డ్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి అంశాల పై కేంద్రం కీలక సమీక్ష నిర్వహించనుంది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ – ప్రమాణాల పెంపు, ఎన్ఎస్టీఎల్ కు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనుంది కేంద్రం.