30ఏళ్ళ వరకు సింగిల్ గా ఉండడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

ఒకవయసుకు రాగానే ఇంట్లో పెద్దలు పెళ్ళి చేసేయాలని యువతీ యువకులకు పోరు పెడుతుంటారు. ఆడవాళ్ళనైతే 20ఏళ్ళ నిండగానే పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతూనే ఉంటారు. ఐతే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఒక వయసుకు వచ్చాక మాత్రమే పెళ్ళి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఆడవాళ్ళైకైనా, మగవాళ్ళైకైనా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనేది వారి ఇష్టానికే వదిలేస్తున్నారు పెద్దలు.

Single
Single/సింగిల్

ఐతే మీకు 30ఏళ్ళు వచ్చాయా? ఇంకా సింగిల్ గానే ఉన్నారా? ఏమీ బాధపడకండి. 30ఏళ్ళు వచ్చినా సింగిల్ గా ఉండడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పరిణతి

30ఏళ్ళు వచ్చాక జీవితంలో ఆలోచనలు చాలా మారతాయి. జీవితం పట్ల ఒకరకమైన దృక్పథం ఏర్పడుతుంది. అవతలి వారిని అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. కాబట్టి మీ లైఫ్ లో మంచి భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

స్నేహితులతో సంబంధం పెరుగుతుంది

20ల్లో ఉండగా రిలేషన్ షిప్ లో దిగితే కుటుంబాన్ని, స్నేహితులను పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. అదే 30ఏళ్ళ వరకు సింగిల్ గా ఉంటే, స్నేహితులతో సంబంధాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ పెరుగుతుంది.

ప్రేమకీ, కామానికీ తేడా తెలుస్తుంది.

20ల్లో ఉన్నప్పుడు ఏది ప్రేమో, ఏది కామమో తెలిసే అవకాశం ఉండదు. చాలాసార్లు కామాన్నే ప్రేమ అనుకునే అవకాశం ఉంది. అదే 30ల్లో ఆ తేడా తెలుస్తుంది.

అనవసర గొడవల్లోకి దిగకుండా ఉంటారు.

ఇరవైల్లో ఉండే ఉడుకు రక్తం 30ల్లో ఉండదు. అనవసరమైన విషయాల్లో దూసుకుపోయే మనస్తత్వం తగ్గిపోతుంది. ఆలోచించే శక్తి పెరుగుతుంది కాబట్టి ఏదైనా గొడవల్లో దూసుకెళ్ళాలని అనుకోరు.

అవతలి వారికి కావాల్సినంత స్వేఛ్చ ఇస్తారు

ఇరవైల్లో ఉన్నప్పుడు మీ పార్టనర్ తో కలిసి ఎక్కువ కాలం గడపాలని ఆలోచిస్తారు. అదే 30ల్లో అయితే అవతలి వారికి కొంచెం ప్రైవేట్ స్పేస్ ఉంటుందని ఆలోచిస్తారు. వారి స్వేఛ్ఛకి భంగం కలిగించకుండా మీ స్వేఛ్చని మీ చేతుల్లో ఉంచుకుంటారు.