భారత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆఫర్ ఇచ్చింది. 50 లక్షల బహుమతి గెలిచే అవకాశం కల్పించింది. అయితే మీరు ఏం చేయాలంటే… ఐసిటి గ్రాండ్ చాలెంజ్ లో పాల్గొనాలి. ‘స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’కు వినూత్న పద్దతిలో అదే విధంగా తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకు రావాలి. ఈ వ్యవస్థలను గ్రామాల్లో కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) సహకారంతో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) ఈ ఈ ఛాలెంజ్ ను మొదలు పెట్టారు. భారతీయ స్టార్టప్ కంపెనీలు లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఇ) అలాగే ఇతర కంపెనీలు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొనవచ్చు అని కేంద్రం పేర్కొంది. మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తికి 50 లక్షలు రెండో స్థానంలో ఉన్న వ్యక్తికి 20 లక్షలు ఇస్తారు.