తెలంగాణా కరోనా.. 2,166 కేసులు, 10 మరణాలు !

తెలంగాణా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తగ్గినట్టు అనిపిస్తున్నా తెలంగాణాలో రోజూ 2 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ లెక్క తగ్గకపోవడం సంచలనంగా మారింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,166 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,74,774 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 10 మంది మరణించారు. ఇప్పటి వరకు ఒక 1052 మంది మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,649గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,44,073 పైగా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 82.43 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 80.82 శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.60 శాతంగా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 53,690 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 25,73,005 పరీక్షలు చేసారు. నిన్న ఒక్క రోజే 2,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 309 కేసులు నమోదయ్యాయి.