నోస్ట్రాడమస్.. భవిష్యత్‌ను ముందే ఊహించి చెప్పేవాడు. మనను బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎలాంటిదో.. ప్రపంచానికి నోస్ట్రాడమస్ అలా. 465 ఏళ్ల క్రితమే కాలజ్ఞానం చెప్పాడు. ‘లెస్ ప్రొఫెటీస్’ అనే పుస్తకంలో ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. అయితే చైనాలోనూ అలాంటి జ్యోతిషుడే ఉన్నాడు. ఆయన పేరు లియూ జోవెన్. తాను రాసిన ‘ద టెన్ వర్రీస్’ అనే నావెల్ పుస్తకంలో ఆయన భవిష్యత్ గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.

అయితే ఈ పుస్తకంలో కరోనా పుట్టుక, అంతాన్ని అంచనా వేశారు. ర్యాట్, క్యాట్ ఇయర్స్ మధ్యకాలంలో భయంకరమైన విపత్తు వస్తుందన్నారు. అది డ్రాగన్, స్నేక్ ఇయర్స్ మధ్యకాలంలో అంతమవుతుందని నావెల్ బుక్‌లో పేర్కొన్నారు. చైనీయుల జోడియాక్ సంవత్సరం ప్రకారం.. ర్యాట్ ఇయర్ 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. పిగ్ ఇయర్ 2020 జనవరి 25న ప్రారంభమైంది. అంటే కరోనాలో చైనాలోని వుహాన్‌లో 2019 డిసెంబర్ 1వ తేదీన తొలి కేసు నమోదు అయింది. అంటే ఆయన చెప్పిన రెండేళ్ల మధ్య కాలంలోనే.. డ్రాగన్ ఇయర్ 2024లో ప్రారంభం కాగా.. స్నేక్ ఇయర్ 2025లో మొదలవుతోంది. ఈ మధ్యకాలంలోనే కరోనా పూర్తిగా నశిస్తుందని ఆయన పేర్కొన్నారు.