వారిద్దరూ కలిసి డాన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది.. క్రికెటర్ అశ్విన్.

-

భారత ఆఫ్ స్పిన్నర్ క్రికెట్ అశ్విన్ కి సినిమాలంటే బాగా ఇష్టం. లాక్డౌన్ టైమ్ లో క్రికెటర్ హనుమ విహారీతో కలిసి తెలుగు సినిమాల గురించి ముచ్చటించాడు కూడా. ఐతే తాజాగా క్రికెటర్ అశ్విన్ తన మనసులో కోరికని వెలిబుచ్చాడు. తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళంలో ఇలయ దలపతి విజయ్ కలిసి డాన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుందని, అలా డాన్స్ చేసే వీలు కలిగితే బాగుంటుందని అన్నాడు. ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి ఒకే తెరపై డాన్స్ చేస్తుంటే చూడడానికి బాగుంటుందని తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

ఇటు అల్లు అర్జున్ అటు విజయ్.. ఇద్దరూ మంచి డాన్సర్లే. తమ డాన్స్ తో మాస్ ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టి స్టార్లు గా ఎదిగారు. మరి వీరిద్దరూ కలిసి డాన్స్ చేస్తే నిజంగా సూపర్ గా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాదిన మల్టీస్టారర్ల హవా పెరిగింది. అదీగాక పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు వస్తున్నాయి. మరి ఏ డైరెక్టరయినా వీరిద్దరితో కలిసి సినిమా చేస్తే, వారిద్దరి డాన్స్ ని చూసే అవకాశం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news