హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిస్తే.. జైలు శిక్షలు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచి ఉంచిన ఇద్దరికీ జైలు శిక్ష వేసింది కోర్టు. ఈ సంఘటన మెహిదీపట్నం ఎల్ఐసీకాలనీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెహిదీపట్నం ఎల్ఐసీకాలనీలోని మండీటౌన్ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచడంతో క్యాషియర్ మహ్మద్ ఇర్ఫాన్(19)పై పోలీసులు కేసు పెట్టారు.
అనంతరం 4వ ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. దీంతో ఇర్ఫాన్‌కు 14 రోజుల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి డీసీ ఉమాపతిరావు. ఆసిఫ్ నగర్లోని సయ్యద్ అలీగూడలో ఫ్రెండ్స్ పాస్ట్ ఫుడ్ సెంటర్‌ను అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉంచడంతో నిర్వాహకుడు మహ్మద్ ముజీబ్ (32) పై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మహ్మద్ ముజీబు 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.