కుక్కను చూసి భయపడి మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్‌..

-

పుడ్‌ డెలివరీ బాయ్స్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. సోషల్‌ మీడియాలో వీళ్లమీద అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వస్తుంటాయి.. ఆకలి చంపుకోని మరీ వాళ్లు కొన్నిసార్లు డెలివరీకి వస్తుంటారు.. ఇంకా ఎండైనా, వానైనా సరే వీళ్లు మాత్రం డెలివరీ చేస్తూనే ఉంటారు.. అలాంటి ఓ కష్టజీవి..ఫుడ్‌ డెలివరీకి వచ్చి ఇంట్లో కుక్కను చూసి భయపడి మూడు అంతస్తుల భవనం మీద నుంచి దూకేశాడట.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఫుడ్‌ డెలివరీకి చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్‌ ఇంట్లో ఉన్న కుక్కకు భయపడి పరుగు తీసి భవనం మీది నుంచి దూకి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో జరిగింది.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… యూసుఫ్‌గూడలోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్‌ రిజ్వాన్‌(23) మూడేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు.. ఎప్పటిలాగే ఆర్డర్‌ డెలివరీకీ వెళ్లాడు…బుధవారం రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 6లోని లుంబిని రాక్‌ క్యాసిల్‌ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్థులో ఆర్డర్‌ డెలివరి ఇచ్చేందుకు వెళ్లాడు. తలుపు తట్టగానే ఇంట్లో ఉన్న జర్మన్‌ షపర్డ్‌ శునకం మొరుగుతూ రావడంతో రిజ్వాన్‌కు భయమేసింది.. ఆ భయంతోనే రిజ్వాన్‌ మూడో అంతస్తు నుంచి కిందకి దూకాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో గమనించిన యజమాని శోభన వెంటనే అంబులెన్స్‌లో నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమాని నిర్లక్ష్యం వల్లే తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు మహ్మద్‌ ఖాజా గురువారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కలు ఉన్నప్పుడు యజమానులు జాగ్రత్తగా ఉండాలి. అవి మన కుక్కలు కాబట్టి.. ఏం చేయవని నమ్మకం ఉంటుంది..కానీ కొత్తవాళ్లకు, పైగా కుక్కలంటే భయపడేవాళ్లకు వాటిని చూస్తేనే చెమటలుపడతాయి.. డెలివరీ వస్తుందని తెలిసి కూడా కుక్కను అలా వదిలేయడం యజమాని నిర్లక్ష్యమే అంటారా..?

Read more RELATED
Recommended to you

Latest news