మరో 1000 పరుగులు కావాలి.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు..!

-

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తక్కువ వన్డే మ్యాచ్ లలో (309) 12 వేల పరుగులు పూర్తి చేసిన రికార్డ్ను కలిగి ఉన్న సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ కేవలం 251 వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుని సంచలన రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే 12 వేల పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీపై ప్రస్తుతం ఎంతో మంది మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఆట తీరు పై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పొగడ్తల వర్షం కురిపించాడు.

విరాట్ కోహ్లీ ల మరెవరూ ఆడ లేరని అది సాధ్యం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. 251 మ్యాచ్ లలోనే 12 వేల పరుగుల మైలురాయిని అందుకోవడం అంటే అంత తేలికైనది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. అందులో 43 శతకాలు.. 60 అర్థ శతకాలు మరింత గొప్ప విషయం. విరాట్ కోహ్లీ చరిత్రలో నిలిచిపోయే క్రికెటర్.. అతని నుంచి మరో 1000 పరుగులు ఆశిస్తున్నాను అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news