మాంత్రికుడి మాటలు విని.. కూతురుని నరికిన తండ్రి.. ఇక చివరికి..!

సమాజం మొత్తం ఆధునిక పోకడలు వైపు పరుగులు పెడుతుంటే ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు ఇంకా బురిడి బాబా లను మంత్రగాళ్ళను నమ్మి ఎంతో మంది ప్రజలు మోసపోతున్నారు. ఇప్పటికి కూడా అక్కడక్కడా ఇలాంటి దారుణం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక మంత్ర గాడు చెప్పిన మాట విని తండ్రి చివరికి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా కన్న కూతురునే దారుణంగా హత్య చేశాడు.

తన కూతురిని బలి ఇస్తే కొడుకు పుడతాడని ఓ మంత్రగాడు ఓ వ్యక్తికి చెప్పాడు. చివరికి ఆ తండ్రి వెనకా ముందు ఆలోచించకుండా దారుణానికి ఒడిగట్టిన ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో వెలుగులోకి వచ్చింది. సుమన్ దినసరి కూలీగా పని చేసుకుంటూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. అతనికి ఆరేళ్ల కూతురు ఉంది. కొడుకు అనుకున్నాడు. దీనికోసం మంత్రగాడి దగ్గరికి వెళ్లి సంప్రదించగా కూతురుని నరికేస్తే కొడుకు పుడతాడు అని చెప్పడంతో కనీసం వెనకా ముందు ఆలోచించకుండా కూతురు ని దారుణంగా నరికేశాడు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని అరెస్టు చేశారు.