పండగ రోజే తుపాకితో కాల్చుకొని చనిపోయిన బీజేపీ నేత కుమారుడు..!

పండుగ రోజే ఉత్తరప్రదేశ్లోని బిజెపి సీనియర్ నాయకుడు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఊహించని ఘటన తో కుటుంబం మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఏకంగా ఊహించని విధంగా బీజేపీ సీనియర్ నేత కుమారుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షహర్ పట్టణంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది

బిజెపి సీనియర్ నాయకుడు హోరం సింగ్ ఇంట్లో పండుగ సమయంలో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఉదయం సమయంలో కుటుంబ సభ్యులు అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అతని కుమారుడు గదిలోంచి తుపాకీ శబ్దం వినిపించింది. ఏంటా అని తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి.. హోరం సింగ్ కొడుకు మహేష్ తుపాకీతో కాల్చుకుని రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.