హైదరాబాద్ మహా నగరంలో సదర్ సందడి మొదలైంది. సాధారణంగా ప్రతి ఏడాది దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ నగరం ముస్తాబు అయింది. ఇప్పటి కే నగరంలో కి బహుబలి కి మంచిన దున్న లు వచ్చాయి. సర్తాజ్, కింగ్, భీమ్, ధార వంటి భారీ బడ్జెట్ దున్నలు ఈ ఏడాది సదర్ ఉత్సవాలకు వస్తున్నాయి.
అంతే కాకుండా దేశం మొత్తం నుంచి దాదాపు 30 వరకు భారీ దున్నలు వస్తున్నట్టు సమాచారం. ఈ దున్నలు తీసుకు రావడం కన్న వాటిని పోషించడం చాలా కష్ట మైన పని గా ఉంటుంది. వీటికి ఆహారం పాలు, బాదం, పిస్లా వంటి డ్రై ఫ్రూట్స్ తప్పని సరిగా ఇవ్వాలి. అంతే కాకుండా రోజు కు దాదాపు 5 కిలో మీటర్ల వాకింగ్ కూడా చెపిస్తారు. దీంతో పాటు 24 గంటల పాటు ఇద్దరు పర్యవేక్షణ తప్పని సరిగా ఉంటారు. అయితే అఖిల భారత యాదవ సంఘం వారు ప్రతి ఏడాది నిర్వహిస్తారు.