The Ghost : హాలీవుడ్‌ సినిమాను తలపిస్తోన్న ‘ది ఘోస్ట్‌’ ట్రైలర్‌..

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న “ది గోస్ట్” చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు ది గోస్ట్ అనే టైటిల్ పెట్టి క్యూరియాసిటీని పెంచేసింది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన యాక్షన్ ప్రోమోకు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది.

ఇక ఈ సినిమాలో నాగార్జున ఓ ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ గా ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్రం బృందం. అంతేకాదు..ఈ ట్రైలర్‌ ను మహేష్‌ బాబు… నిన్న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్‌ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. హాలీవుడ్‌ రేంజ్‌ లో మనకు సన్నివేశాలు కనిపిస్తాయి. ఇందులో నాగార్జున చాలా కొత్తగా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news