కన్నడలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు యశ్. కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమాలో ఎంతోమంది నటులు తమ నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ఇక అందులోని ఖాసిం చాచా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండే ఉంటుంది. ఇక హీరో రాఖీ ని కే జి ఎఫ్ సినిమాలో చేరదీసి చివరి వరకు అతనితో తోడుగా నిలుస్తాడు. ఇక ఈ సినిమాలో ముస్లిం పాత్రలో వృద్ధుడి పాత్రలో ఖాసిం చాచా బాగా అలరించారని చెప్పవచ్చు. ఇక ఈ నటుడు అసలు పేరు హరీష్ రాయ్.ఇక తనదైన నటనతో మెప్పించిన ఈ సీనియర్ నటుడు ఇప్పుడు క్యాన్సర్ తో చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతను కిడ్వాయి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదివరకే ఈ నటుడు యొక్క ఊపిరితిత్తులకు సర్జరీ కూడా జరిగింది. అయితే క్యాన్సర్ పూర్తిగా నయం కావాలంటే మరింత చికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే తన వద్ద ఉన్న డబ్బు అంతా కూడా పూర్తిగా ఖర్చయిపోయింది అని ఇంకా మిగిలి ఉన్న చికిత్స కోసం ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తారని హరీష్ రాయ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే తనకు క్యాన్సర్ వ్యాధి ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టారు హరీష్ రాయ్. ఇలా ఎందుకు చేశారని ఆయనను అడగగా.. మొదటిసారిగా తనకు థైరాయిడ్ సమస్య ఉన్నదని పరీక్షలు చేయించుకోవా అందులో క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది అని.. నాకు క్యాన్సర్ ఉందని తెలిస్తే ఎవరు తనకి సినిమాలో అవకాశాలు ఇవ్వరని , అందుచేతనే ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలిపారు. తనకి ప్రస్తుతం డబ్బుతో చాలా అవసరం అని అయితే క్యాన్సర్ తో బాధపడుతున్న తనకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి.. సినిమా వాళ్లు కూడా తనని దూరం పెడతారని భయం తనలో కలిగింది అని కన్నీటి పర్వతమయ్యారు హరీష్ రాయ్. ఈయన పరిస్థితిని తెలుసుకున్న కొంతమంది కన్నడ పరిశ్రమకు చెందిన వారు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.