తెలంగాణాలో దారుణం: బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం, గర్భం దాల్చడంతో…

-

వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గొండి మండలం రేపల్లెలో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికపై కొంత కాలంగా ఇద్దరు యువకులు అత్యాచారం చేస్తున్నారు. దీనితో ఆ బాలిక గర్భం దాల్చింది. గర్భం తీసేందుకు బాలికకు యువకులు మాత్రలు ఇవ్వడం సంచలనం అయింది. తీవ్ర రక్తస్రావంతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

rape
rape

పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గతనెల 26న ఘటన జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారు ముగ్గురు కూడా బాలికతో సన్నిహితంగా ఉండే వారే అని సమాచారం. ముగ్గురు యువకులను కూడా రిమాండ్ కి తరలించి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news