ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండ్ ను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో అయితే మరీ ఎక్కువ. ఏ చిన్న సందర్భం దొరికినా బంగారం వెండి కొనుగోలుకు ఆసక్తిని చూపుతారు. వివిధ రూపాల్లో బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఓ శుభవార్త. గత మూడు రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు మాత్రం శాంతించాయి. పసిడి రేటు లో మే 23న ఎలాంటి మార్పు లేదు.

బంగారం ధర స్థిరంగానే ఉంది. 22 క్యారెట్లు 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ 47,050, రూ.51,330 వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధరలు గత మూడు రోజుల కాలంలో రూ. 1000 కి పైగా పరుగులు పెట్టాయి. ఈ ధరలు నేడు నిలకడగానే కొనసాగుతూ ఉంటే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర లో కూడా మార్పు లేదు. సిల్వర్ రేటు కేజీకి రూ. 65,900 వద్దనే ఉంది.